కొప్పళ జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం
రాయచూరు రూరల్: కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి జాతరకు మేఘాలయ గవర్నర్ సీహెచ్ విజయ శంకర్‌కు ఆహ్వానం పలికారు. ఇటీవల కొప్పళ గవి సిద్దేశ్వర మఠాధిపతి అభినవ గవి సిద్దేశ్వర స్వామీజీ మేఘాలయలో రాష్ట్ర గవర్నర్‌ను ఆయన కార్యాలయంలో కలసి 2025 జనవరి 5న జరిగే కొప్పళ గవి సిద్దేశ్వర స్వామి మహారథోత్సవాన్ని ప్రారంభించడానికి రావాలని ఆహ్వానించారు. మేఘాలయ రాష్ట్ర గవర్నర్ సీ.హెచ్.విజయ శంకర్ కొప్పళ జిల్లా కుకనూరు తాలూకా బిన్నాళకు చెందిన వారు కావడంతో స్వామీజీ రథోత్సవానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: సమాజంలో ఉపాధ్యాయులు మానవతా విలువలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బడిగేర్ పిలుపునిచ్చారు. ప్రైవేట్ కళాశాలలో జిల్లా, తాలూకా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధనతో పాటు బోధనేతర విషయాలు, సంస్కృ,తి సంప్రదాయాల గురించి వివరించాలన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న కౌశల్యతను కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు మరిచి సామరస్యంతో జీవించాలన్నారు. తాలూకా విద్యాశాఖ అధికారి ఈరణ్ణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, మొయిన్ ఉల్ హక్, మల్లేష్ నాయక్, యూనుస్ సాబ్, రామక్రిష్ణ, వీరేష్, రావుత్ రావ్, శివ కుమార్‌లున్నారు.
బెళగావిని మూడు
జిల్లాలుగా విభజించండి
రాయచూరు రూరల్: 18 తాలూకాలతో కూడిన బెళగావి జిల్లాను మూడు భాగాలుగా విభజించాలని బెళగావి జిల్లా శాసన సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినతిపత్రం సమర్పించిన శాసన సభ్యుడు బాలచంద్ర జార్కిహోళి, ప్రజా పనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం గోకాక్ లోక్‌సభ నియోజక వర్గంగా ఉందని, దానిని గోకాక్ జిల్లాగా, చిక్కోడి జిల్లాగా విభజించాలన్నారు. బెళగావి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించాలని స్వామీజీల నేతృత్వంలో కమిటీ తరఫున వినతిపత్రం అందించారు.
వ్యవసాయ శాఖ
కార్యాలయం బదిలీ తగదు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సింధనూరుకు బదిలీ చేయడం తగదని లింగసూగూరు తాలూకా అభివృద్ధి పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం తాలూకా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో పదాధికారి రమేష్ మాట్లాడారు. తాలూకా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాన్ని ఎలాంటి అనుమతి లేకుండా లింగసూగూరు నుంచి సింధనూరుకు తరలించడాన్ని తప్పు బట్టారు.
నాటకరంగాన్ని పరిరక్షించాలి
కోలారు: నాటక రంగాన్ని పరిరక్షిస్తూ కళాకారులను ఆదరించాలని జిల్లా జాగృతి సమితి సభ్యుడు బెళమారనహళ్లి ఆనంద్ సూచించారు. నగరంలోని టీ చెన్నయ్య రంగమందిరంలో రాష్ట్ర స్థాయి కర్ణాటక నాటక అకాడమి అవార్డు గ్రహీత బ్యాడబెలె కె మురళి దర్శకత్వంలో సోమవారం రాత్రి నిర్వహించిన ముదుకన మదువె నాటకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మొబైల్, టీవీ, సినిమాలకు పరిమితమై నాటక, జానపదచ, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కనపర్చడం లేదన్నారు.కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. కసాప మాజీ అధ్యక్షుడు నాగానంద కెంపరాజ్ మాట్లాడుతూ సంగీత, నాటక, జానపద తదితర కళల పరిరక్షణకు మురళి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కన్నడ సంస్కృతిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, నాటక వ్యవస్థాపకుడు మురళి, మునిరాజు, రోటరీ అధ్యక్షుడు రామచంద్రప్ప, అంతరగంగ బుద్దిమాంద్య సంస్థ సంస్థాపకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కొప్పళ జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం
కొప్పళ జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం
కొప్పళ జాతరకు గవర్నర్‌కు ఆహ్వానం


