బస్సు బోల్తా పడి కండక్టర్ దుర్మరణం
●35 మంది ప్రయాణికులకు గాయాలు
●రాయచూరు జిల్లా దేవదుర్గలో ఘటన
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడ్డ ఘటనలో కండక్టర్ దుర్మరణం చెందగా 35 మంది ప్రయాణికులకు గాయాలైన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం దేవదుర్గ తాలూకా అంజళ నుంచి దేవదుర్గకు వాపస్ వస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ తప్పడంతో అంచెసూగూరు వద్ద కాలువ గట్టు వద్ద బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన కండక్టర్ బసవరాజ్(35) రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 40 మందిలో 38 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో దేవదుర్గ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న రైతులు ఘటన స్థలానికి చేరుకొని కిటికీ అద్దాలను పగులగొట్టి క్షతగాత్రులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దేవదుర్గ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ప్రభుత్వ పాఠశాలల విలీనం వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కన్నడ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేసి కర్ణాటక పబ్లిక్ పాఠశాల(కేపీఎస్)ల్లోకి విలీనం చేయడానికి ముందుకొచ్చిన సర్కార్ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేయబోమని ఆదేశాలు జారీ చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు తాలూకా అన్వరిలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నందగోపాల్ మాట్లాడారు. సోమవారం బెళగావి విధానసభలో శాసన సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు ప్రాథమిక విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప మాట్లాడారు. రాష్ట్రంలో కన్నడ భాష ప్రాథమిక పాఠశాలను మూసేయడం లేదని చెప్పిన సమాధానానికి లిఖిత రూపంలో ఆదేశాలు జారీ చేయాలన్నారు.
కేంద్ర మంత్రిని నిందించడం తగదు
రాయచూరు రూరల్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఏకవచనంతో నిందించడం తగదని రాయచూరు జిల్లా మహిళా బీజేపీ అధ్యక్షురాలు, నగరసభ మాజీ అధ్యక్షురాలు లలిత కడుగోలు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు భారతీయ సంప్రదాయం, మహిళలపై గౌరవం లేదన్నారు.
బస్సు బోల్తా పడి కండక్టర్ దుర్మరణం
బస్సు బోల్తా పడి కండక్టర్ దుర్మరణం


