ఉల్లాసంగా.. ఉత్సాహంగా
హుబ్లీ: దివ్యాంగ బాలలు దేవుడి బిడ్డలుగా సమాజంలో అంతంత మాత్రమే ఆదరణకు నోచుకుంటున్నారు. అలాంటి ఈ పిల్లలకు మంగళూరులో వాట్సప్ గ్రూప్ ద్వారా సామాజిక స్పృహ కలిగిన ఓ బృందం పిక్నిక్ విహార యాత్ర ఏర్పాటు చేసి ఆ పిల్లల్లో కాసింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని నింపింది. మంగళూరుకు చెందిన పోస్టల్ ఫ్రెండ్స్ అనే బృందం ఈ మానవత కార్యక్రమాన్ని చేపట్టి అందరిలో వమాయమవుతున్న మానవత్వం పట్ల ప్రేరణ కలిగించింది. 2017లో ముగ్గురుతో ప్రారంభం అయిన ఈ వ్యాట్సప్ గ్రూప్ నమోదిత ట్రస్ట్‌గా సేవలు అందిస్తున్న ఈ సంస్థలో ప్రస్తుతం 80 మంది సభ్యులు ఉన్నారు. అబుదాబిలో నివసిస్తున్న పుత్తూరు పార్లడ్క నివాసి సిరాజ్ ఉద్దీన్ మదిలో చిగురించిన ఈ సంస్థకు షరీఫ్ అబ్బాస్ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా తెలివిగా మెలగాలని శిక్షణ కూడా ఇచ్చారు. ఈ వ్యాట్సప్ గ్రూప్‌లో ఉన్న వారు నియమాల ప్రకారం విసుగుతో మెసేజ్ డిలీట్ చేస్తే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సొమ్ము రూ.10 వేలు దాటితే సమాజానికి దానంగా అందిస్తారు. ఈ సంస్థ సామాజిక, విద్య, ఆరోగ్య రంగాలపై అధిక ప్రాధాన్యతను ఇస్తూ రక్తదానం, మెడికల్ బెడ్, వీల్ చెయిర్ల పంపిణీ కార్యక్రమాన్ని విరివిగా చేపడుతోంది. మొత్తం మీద గ్రూప్ సమాజానికి భారంగా భావించే కొందరి వైఖరిని మేల్కొలిపేలా చేస్తున్న కృషి అభినందనీయం.
దివ్యాంగ బాలలకు పిక్నిక్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా


