చురుగ్గా డ్యాం పాత గేట్ల తొలగింపు పనులు
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల ప్రజలకు, రైతులకు తాగు, సాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 18వ గేట్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. గత మూడు రోజుల నుంచి 18వ నంబరు పాత గేట్‌ను తొలగించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ గేట్ ఒక భాగం నీటి మట్టానికి 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. గేట్ ఒక భాగాన్ని కత్తిరించి తొలగించారు. డిసెంబర్ మూడో వారం నాటికి కొన్ని గేట్లను తొలగిస్తున్నట్లు తుంగభద్ర బోర్డు వర్గాలు తెలిపాయి. పాత గేట్ల తొలగింపు పనులు పూర్తి కాగానే కొత్త గేట్లను అమర్చే పనులు ప్రారంభిస్తామన్నారు. 33 గేట్ల నిర్మాణ పనుల టెండర్‌ను గుజరాత్‌కు చెందిన కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. సుమారు రూ.52 కోట్ల ఖర్చుతో గేట్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 17 నూతన గేట్ల నిర్మాణ పనులు పూర్తయినట్లు మండలి అధికార వర్గాలు తెలిపారు. మిగతా గేట్ల నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని, దశల వారీగా గేట్ల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు.
చురుగ్గా డ్యాం పాత గేట్ల తొలగింపు పనులు


