దశాబ్దాలు గడిచినా శుభ్రత మిథ్య
రాయచూరు రూరల్: నగరవాసులకు కలుషిత నీటిని విడుదల చేయడంతో వాటిని తాగి వాంతులు, విరేచనాలతో ిపిల్లలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. నిరంతర నీటి సరఫరాకు రూ.135 కోట్లు వ్యయం చేసి ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు విఫలం అయ్యారు. తుంగభద్ర ఎడమ కాలువ నుంచి రాంపుర జలాశయం ద్వారా నీటిని ట్యాంకులకు సరఫరా చేస్తారు. 25 ఏళ్ల క్రితం నిర్మించిన 35 ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, 7 భూగర్భ ట్యాంకులలో ఒండు మట్టి మిశ్రితం కావడంతో ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో నగరసభ పాలక, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
మరమ్మతుకు నోచుకోని ట్యాంకులు
కొళాయిల్లో మంచినీరు రాని వైనం
దశాబ్దాలు గడిచినా శుభ్రత మిథ్య


