ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో

Dec 9 2025 9:33 AM | Updated on Dec 9 2025 9:33 AM

ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో

ప్రభుత్వంతో విపక్షం తాడోపేడో

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మంగళవారం బెళగావి సువర్ణ విధానసౌధ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనుంది. కష్టాల్లో ఉన్న చెరకు, మొక్కజొన్న పండించిన రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదు. అతివృష్టితో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందించలేదు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించిన బీజేపీ మంగళవారం బెళగావిలో మాలిని మైదానంలో రైతులతో భారీ సమావేశం నిర్వహించి, ఆ తరువాత సువర్ణసౌధను ముట్టడించనుంది. మంగళవారం రైతుల సమావేశం, సువర్ణ విధానసౌధ ముట్టడి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, ప్రతిపక్ష నాయకులు ఆర్‌.అశోక్‌, ఛలవాది నారాయణస్వామి నేతృత్వంలో జరుగనుంది. బీజేపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు, రైతులు పాల్గొననున్నారు.

తప్పుడు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్‌–విజయేంద్ర

రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగం, నీటిపారుదల, చేనేతకారుల, రైతుల సమస్యలతో పాటు వేటినీ నెరవేర్చలేదు. అంతేకాకుండా ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయటంలోనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిమగ్నమయ్యారని విజయేంద్ర విమర్శించారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మరిచిపోయారు. వీటన్నిటిని ఖండిస్తూ మంగళవారం సువర్ణ విధానసౌధ ముట్టడించటం ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని సువర్ణ విధానసౌధ వద్ద విలేకరులకు తెలియజేశారు.

ఉత్తర కర్ణాటక సమస్యలపై చర్చకు పెద్దపీట

విధాన పరిషత్‌ కార్యకలాపాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు పెద్దపీట వేస్తామని పరిషత్‌ సభాపతి బసవరాజ్‌ హొరట్టి తెలిపారు. సోమవారం బెళగావిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిషత్‌ సమావేశాల్లో గత సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై ఎక్కువగా చర్చ జరగలేదు. అయితే ఈసారి సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలు, విషయాలపై చర్చకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. దక్షిణ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు, ఉత్తర కర్ణాటక ప్రజల సమస్యలపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తాం. ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత ఉత్తర కర్ణాటక సమస్యల గురించి చర్చిస్తామన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక సమస్యలపై ఉత్తర కర్ణాటక ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఫోన్‌ చేసి అందరు ఎమ్మెల్యేలకు కూడా చెబుతున్నానన్నారు. సమావేశాల్లో పాల్గొనాలని ఇప్పటికే 38 మందితో మాట్లాడాను. మిగతావారితో కూడా మాట్లాడుతున్నాను. అందరూ కూడా సమావేశాల్లో పాల్గొని సభా గౌరవాన్ని కాపాడాలని హొరట్టి విన్నవించారు.

పరిహారం చెల్లింపునకు సిద్ధం

పరిహారం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా ఉంది కదా? ఇప్పటి వరకు కూడా బొమ్మై ఎందుకు పార్లమెంట్‌లో ఈ విషయం గురించి మాట్లాడలేదు? ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి ఎందుకు చర్చించలేదు? అని ప్రశ్నించారు. నీటిపారుదల సమస్య, పథకాలు అమలు కాకపోవటం గురించి అడిగినపుడు తమ హయాంలో నీటిపారుదల రంగానికి చేసినంత చరిత్రలో ఎవ్వరూ చేయలేదని చెబుతున్నారు. అయితే తాను కోరేది ఒక్కటే రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై బొమ్మై మాట్లాడాలి అని అన్నారు.

సర్కారు రైతు వ్యతిరేక విధానంపై నిరసన

నేడు సువర్ణ విధానసౌధ ముట్టడికి

బీజేపీ సన్నద్ధం

నియమావళి ప్రకారం నడుచుకుంటా: హొరట్టి

సభాపతి స్థానం నుంచి తనను తొలగించే విషయంపై ఆయన మాట్లాడుతూ తాను గతంలో పరిషత్‌ సభాపతిని అయ్యాను. ఎన్ని సంవత్సరాలైనా కూడా మాజీ కానే కావాలి. విధాన పరిషత్‌ సభాపతి స్థానం గురించి తాను అంతగా విచారానికి గురికాను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు తీసుకునే తీర్మానానికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. సభలో తనపై అవిశ్వాస నిర్ణయం ప్రవేశపెట్టే సమయం వస్తే నియమాల ప్రకారం నడచుకొంటానన్నారు. విధాన పరిషత్‌లో ఖాళీ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరుగలేదు. 30 ఉద్యోగాలకు కర్ణాటక పరీక్ష ప్రాధికార (కేఈఏ) పరీక్ష జరిపి అధిక మార్కులు పొందినవారి జాబితా ఇచ్చింది. దానిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఉ–క సమస్యలకు కేంద్రమే బదులివ్వాలి– డీకే శివకుమార్‌

ఉత్తర కర్ణాటక సమస్యలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. చెరకు, మొక్కజొన్న రైతుల విషయమై తాను, సీఎం సిద్దరామయ్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణమైన తీర్మానాన్ని తీసుకున్నట్లు డీసీఎం డీ.కే.శివకుమార్‌ తెలిపారు. సదాశివనగర నివాసం వద్ద మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ చెరకు, మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. బీజేపీకి చెందిన ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్యల గురించీ నోరు విప్పటం లేదన్నారు. బసవరాజ్‌ బొమ్మై రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెబుతున్నారు. అలాగైతే కేంద్ర ప్రభుత్వం వాటా ఏమిటి? దీనిని తీర్మానం చేసేవారు ఎవరు? ప్రతి ఒక్కదానికి ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. అయినా కూడా ఈ విషయంలో తీర్మానం చేయటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement