తెరపైకి ఉ–క ప్రత్యేక రాష్ట్ర చిచ్చు
రాయచూరు రూరల్ : అఖండ కర్ణాటకను విభజించడంతో పాటు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం తెరపైకి రానుంది. సోమవారం నుంచి బెళగావిలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై గళం విప్పడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గతనెల 4న ఎమ్మెల్యే లేఖ రాసిన విషయం ప్రస్తావించడానికి ప్రజా ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, కొప్పళ, బళ్లారి, విజయనగర, బీదర్, రాయచూరు, బాగల్‌కోటె, బెళగావి, ధార్వాడ, గదగ్, ఉత్తర కన్నడ, హావేరి, దావణగెరె జిల్లాల సమగ్ర అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నెల రోజుల క్రితం కాగవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరమగౌడ లేఖ రాశారు. ప్రజల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధి ప్రజల సమస్యలపై ప్రస్తావించినా పనులు కావడం లేదని తమను ఎన్నుకున్న ప్రజలు నిలదీస్తున్న అంశాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశంలో ప్రత్యేక తెలంగాణ ఉద్భవించిన నేపథ్యంలో ఇప్పుడు ఉత్తర కళ్యాణ కర్ణాటక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర కర్ణాటకపై సవతి ప్రేమ
దక్షిణ కర్ణాటక ప్రాంతాలపై ప్రభుత్వం ప్రేమ ఒలకబోస్తూ ఉత్తర కర్ణాటకపై సవతి తల్లి ప్రేమను ఒలక బోస్తోందని ఉత్తర, కర్ణాటక పోరాట సమితి, ఉత్తర కర్ణాటక వికాస్ వేదిక సంచాలకుడు భరమగౌడ లేఖ రాసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో 15 జిల్లాల సమగ్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు. గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి ఉమేష్ కత్తి ఆందోళన జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. జనాభా పెరిగే కొద్దీ రాష్ట్రాలను విభజించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కర్ణాటకలో రెండు, ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదు, మహారాష్ట్రలో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. దేశంలో కొత్తగా 50 రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం ముందడుగు వేయాల్సి ఉంది. బెళగావిలో జరుగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చ జరగకపోతే బెళగావి సువర్ణసౌధపై ప్రత్యేక రాష్ట్ర జెండాను ఎగురవేస్తామని ఎమ్మెల్యే భరమగౌడ వెల్లడించారు. బుధవారం నుంచి ఉత్తర, కళ్యాణ కర్ణాటకపై విధాన పరిషత్‌లో చర్చలు జరగడానికి అవకాశం కల్పిస్తున్నట్లు విధాన పరిషత్ స్పీకర్ బసవరాజ్ హొరట్టి వెల్లడించారు. సోమవారం బెళగావి సువర్ణసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బుధవారం నుంచి బెళగావి సమావేశాల్లో చర్చకు చాన్స్
కర్ణాటకలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి
రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసిన ఎమ్మెల్యే రాజుకాగె
తెరపైకి ఉ–క ప్రత్యేక రాష్ట్ర చిచ్చు
తెరపైకి ఉ–క ప్రత్యేక రాష్ట్ర చిచ్చు


