జాతీయ కరాటే పోటీల్లో సత్తా
కేజీఎఫ్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో నగరానికి చెందిన ఒకినావా కరాటే విద్యా సంస్థ విద్యార్థులు వరుసగా మూడో సారి చాంపియన్లుగా నిలిచారు. సోమవారం చాంపియన్లుగా తిరిగి వచ్చిన సంస్థ విద్యార్థులను అభినందించి కరాటే మాస్టర్ ఉలగనాథన్ మాట్లాడారు. తమ సంస్థ వరుసగా మూడోసారి కరాటే చాంపియన్‌షిప్ సాధించడం హర్షణీయమన్నారు. విద్యార్థుల సాధనను తాను అభినందిస్తున్నానన్నారు. ఆత్మరక్షణలో కరాటే ఒక భాగం అని, తల్లిదండ్రులు కరాటేను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. తమ పిల్లలకు కరాటే నేర్పించాలన్నారు. తమను తాము రక్షించుకోవడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరూ కరాటే తప్పకుండా నేర్చుకోవాలన్నారు. ప్రతి నిత్యం ఒక గంట పాటు కరాటే అభ్యాసం చేయడం ద్వారా ఎంతో ఉపయోగం ఉందన్నారు. కరాటే ద్వారా శారీరక దారుఢ్యం కలిగి ఆరోగ్యం సుస్థితిలో ఉంటుందన్నారు. కరాటే నేర్చుకున్న విద్యార్థులు చదువులో ముందంజలో ఉండడాన్ని చూస్తున్నామన్నారు. తమ విద్యార్థులు చాంపియన్‌న్లుగా తిరిగి రావడం కేజీఎఫ్ నగరానికి గర్వకారణమన్నారు.


