రోడ్లలో గుంతలు పూడ్చండి
రాయచూరు రూరల్: జిల్లాలో గుంతలు పడ్డ రహదారి పనులను చేపట్టి సత్వరం గుంతలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లాధికారి నితీష్ అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. గ్రామీణ, నగర ప్రాంతాల్లో రహదారుల్లోని గుంతలను పూడ్చాడాలన్నారు. ప్రజా పనుల శాఖ, పంచాయత్‌రాజ్, ఆర్‌అండ్‌బీ, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభల పరిధిలో పడ్డ గుంతలను మూసి వేయాలన్నారు. గుంతలు పడ్డ ప్రాంతాల్లో పలువురు గాయపడ్డారని గుర్తు చేశారు. రహదారి పక్కనే ఉన్న అంగళ్లు, దుకాణాలను తొలగించాలని సూచించారు. ద్వి చక్రవాహనంలో సంచరించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సమావేశంలో ఇంజినీర్ వెంకటేష్, ఆర్‌టీఓ, పోలీస్, ఇతర శాఖల అధికారులున్నారు.


