రైతులకు పరిహారం కోసం ధర్నా
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రైతులకు పరిహారం అందించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి సర్కార్‌ను డిమాండ్ చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. ఈ విషయంలో కళ్యాణ కర్ణాటకలోని శాసన సభ్యులు బెళగావిలో జరుగుతున్న అసెంబ్లీలో నోరు మెదపాలన్నారు. వరి, పత్తి, కంది, ఇతర పంటలు ఖరీఫ్‌లో కురిసిన వానలకు పూర్తిగా నష్టం సంభవించినట్లు ఆరోపించారు. రాయచూరులో మిరప మార్కెట్‌ను ప్రారంభించాలన్నారు. మద్దతు ధరతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శివశంకర్, నరసింహ నాయక్, లక్ష్మిపతి, రామకృష్ణ, జంబునాథ్, నాగరాజ గౌడ, అమరేష్ పాటిల్, నరసప్పలున్నారు.


