యాదగిరిలో బాలింత మృతి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో బాలింత మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదగిరి తాలూకా బలిచక్ర తాండాకు చెందిన నీలాబాయి(21) అనే గర్భిణి ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు కాన్పు అయింది. అధికంగా రక్తస్రావం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కడుపులో శిశువు మరణించడంతో జిల్లాస్పత్రిలో లోబీపీతో మరణించినట్లు డైరెక్టర్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 20 మంది బాలింతలు మరణించినట్లు సమాచారం. వడగేర, హుణసగి, సురపుర, శహాపుర, భీమరాయనగుడి తాలూకా ఆస్పత్రిలో సక్రమంగా వైద్య సౌకర్యాలు, చికిత్స లభించక మరణించారు. కాగా బాలింత, శిశువు మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.


