లారీని ఢీకొని కారు దగ్ధం
దొడ్డబళ్లాపురం: పాల ట్యాంకర్ లారీని ఢీకొని నడి రోడ్డుపై కారు కాలి బూడిదైన సంఘటన ఆదివారం ఉదయం బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో జరిగింది. మైసూరు నుంచి బెంగళూరు వైపు వస్తున్న డస్టర్ కారు ముందు వెళ్తున్న పాల ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారంతా వ్యాపించి పూర్తిగా కాలిబూడిదైంది. కారులో ఉన్న వారు బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇద్దరు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. రామనగరలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రామనగర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తగలబడిపోతున్న కారు


