హామీలు ఏమయ్యాయి?
ప్లాస్టిక్ రహిత బళ్లారి జిల్లాగా మారుస్తామని ఏళ్ల తరబడి అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణ పెట్టడంలేదు. ఆ దిశగా ఒక్క అడుగు పడకపోవడంతో సామాన్య, మధ్య తరగతి జనం ఆరోగ్యాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించే మాట అటుంచితే.. కనీసం హోటళ్లలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంలోనూ మహా నగర పాలికె, పుడ్ సేఫ్టీ అధికారులు విఫలమవుతున్నారు. అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండడంతో తుతూమంత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. పలుమార్లు సమావేశాల్లో మేయర్ హామీలు గుప్పిస్తున్నారే గానీ ఆచరణ పెట్టడంలేదు. పాలికె అధికారులు వచ్చినపుడు మాముళ్లు ఇచ్చి అనంతరం వ్యాపారులు తమ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ వాడకంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


