రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు
కెజీఎఫ్: విద్యార్థులు చదవుతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే రూపా శశిధర్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన అండర్–14, అండర్–17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో ఏకాగ్రత పెరిగి విద్యార్థులు పట్టుదలతో ఉన్నత చదువులు అభ్యసించే అవకాశం కలుగుతుందని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సమానంగా తీసుకుని ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో ఆడాలన్నారు. అనంతరం పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందించారు.


