హోంగార్డులకు బహుమతులు అందజేత | - | Sakshi
Sakshi News home page

హోంగార్డులకు బహుమతులు అందజేత

Dec 8 2025 7:56 AM | Updated on Dec 8 2025 7:56 AM

హోంగా

హోంగార్డులకు బహుమతులు అందజేత

రాయచూరురూరల్‌: సమాజంలో శాంతి భద్రతలకు సహకరించడంతోపాటు హోంగార్డులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. స్థానిక పోలీస్‌ మైదానంలో జరిగిన క్రీడలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 24 గంటలపాటు విధులు నిర్వహిహిస్తూ మానసికంగా, శారీరకంగా, ధైర్యంగా ఉండేందుకు క్రీడలు సహకరిస్తాయని తెలిపారు. అనంతరం మొక్క నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎస్పీ పాటిల్‌, క్రీడాధికారి ఈరేష్‌ నాయక్‌, రాణోజి, మంజునాథ్‌ దేశాయ్‌, నింబనగౌడ, వరదరాజ్‌, చెన్నప్పగౌడ, చంద్రశేఖర్‌, శాంతప్ప, శివప్ప, బస్వంత్‌ సింహా, వీరభద్ర, సుభాష్‌ చంద్ర, జావెద్‌ పాల్గొన్నారు.

మూఢ నమ్మకాలపై అవగాహన

బళ్లారిటౌన్‌: సమాజంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 11న ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌హెచ్‌ఎం.చెన్నబసయ్యస్వామి తెలిపారు. స్థానిక పత్రికా భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైజ్ఞానిక మనోభావాన్ని పెంపొందించే దిశగా కర్ణాటక రాష్ట్ర విజ్ఞాన తంతర్‌ జ్ఞానపరిషత్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. యాదగిరిలో ఈ నెల 28వతేదీ నుంచి మూడు రోజులపాటు ఐదో రాష్ట్ర స్థాయి విజ్ఞాన సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మూఢ నమ్మకాలను నియంత్రించేలా చట్టం తెచ్చినా.. ఇంకా సామాజిక మాధ్యమాలలో జోతిష్యం, చేతబడులపై ప్రకటనలు వస్తున్నాయన్నారు. పిల్లల్లో అవగాహన కల్పించేందుకు జ్ఞానామృత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు.

గర్భంలోనే శిశువు మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమన్న

కుటుంబ సభ్యులు

హుబ్లీ: వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని గర్భిణి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరి తాలూకా బలిచక్ర తండా నివాసి నీలాబాయి ప్రసవ నొప్పులతో యాదగిరి ప్రభుత్వ మాతృ శిశు ఆస్పత్రికి వచ్చారు. నిండు గర్భిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆపరేషన్‌ చేసి వైద్యులు శిశువును బయటకు తీశారు. చికిత్స చేసిన వైద్యులు బిడ్డ మరణించిందని తెలుపడంతో నీలాబాయి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవ వేదనతో వచ్చిన మహిళకు సరైన చికిత్స అందించకపోవడం, బెడ్డు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంతోనే శిశువు మరణించిందని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేగాక శిశువు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హంపీలో ఫల పూజ

హొసపేటె: దక్షణ కాశీగా పేరొందిన హంపీలో రాత్రి ఫలపూజ ఘనంగా నిర్వహించారు. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ, దేశం నల మూలల నుంచి భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం హంపీ విరుపాక్షవర విద్యారణ్య పీఠానికి చెందిన విద్యారణ్య భారతిశ్రీ సమక్షంలో వేలాది భక్తులు ఉత్సవ విగ్రహంతో విరుపాక్షేశ్వర ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. కోదండ రామస్వామి ఆలయంలో వేద మంత్రోచ్ఛరణ మధ్య విరూపాక్ష, పంపాంబికాదేవి నిశ్చితార్థం సంప్రదాయం ప్రకారం జరిపించారు. విజయనగర, బళ్లారి, బళ్లారి, కోప్పళ, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు. ఎస్పీ ఎస్‌.జాహ్నవి ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న బైక్‌

ఇద్దరు దుర్మరణం

చెళ్లకెరె రూరల్‌: తాలూకాలోని కాలువె హళ్లి గ్రామంలో విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వివరాల మేరకు.. శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రకాష్‌ (30), మధు (35) బైక్‌పై చెళ్లికెరె నగరానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో కాలువెహళ్లి వద్ద బైక్‌ అదుపు తప్పి విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో కిందపడ్డారు. ప్రకాష్‌, మధు అక్కడికక్కడే మరణించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు.

హోంగార్డులకు  బహుమతులు అందజేత 1
1/3

హోంగార్డులకు బహుమతులు అందజేత

హోంగార్డులకు  బహుమతులు అందజేత 2
2/3

హోంగార్డులకు బహుమతులు అందజేత

హోంగార్డులకు  బహుమతులు అందజేత 3
3/3

హోంగార్డులకు బహుమతులు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement