టీబీ డ్యాం పనులు వేగవంతం
రాయచూరురూరల్: తుంగభద్ర జలాశయం వద్ద 33 క్రష్ గేట్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడిగి ఆదేశించారు. మునీరాబాద్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ నాటికి గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. వేసవిలో ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. జలాశయంలో 23 టీఎంసీల నీటిని వినియోగించారని వివరించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ హార్డ్‌వేర్ టూల్స్, మిషనరీ ప్రాజెక్టు కంపెనీ ప్రతినిధుల సలహా మేరకు పశ్చిమబెంగాల్‌లోని పరాక్ బ్యారెజీకి 124 గేట్లను అమర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ నాయక్, ఎస్‌ఈ సత్యనారాయణ, గిరీష్, విజయలక్ష్మి, శాంతారాజ్, గోడేకర్ పాల్గొన్నారు.
మంత్రి శివరాజ్ తంగడిగి
టీబీ డ్యాం పనులు వేగవంతం


