అసత్య ప్రచారం చేయవద్దు
కోలారు: కోలారు జిల్లాలో అభివృద్ధి పనులకు నిధులివ్వడం లేదనే అసత్య ప్రచారం చేయవద్దని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ పేర్కొన్నారు. తాలూకాలోని దొడ్డహసాళ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. కోలారు నియోజవర్గంలో రూ.1041 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దొడ్డహసాళ, చిక్కహసాళ గ్రామాలలో రహదారుల అభివృద్ధికి రాబోయే బడ్జెట్ నుంచి రూ.60 లక్షలు ఇస్తామన్నారు. దొడ్డహసాళ పంచాయతీ భవిష్యత్తులో కోలారు నగరంలోకి చేరుతుందని, బంగారుపేటకు వెళుతున్న రహదారిని చతుష్పథ రహదారిగా మార్పు చేస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో రింగ్ రోడ్డు పనులు ప్రారంభమవుతాయని వివరించారు. విధాన పరిషత్ సభ్యుడు ఇంచర గోవిందరాజులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంఎల్.అనిల్‌కుమార్, కోముల్ డైరెక్టర్ చంజిమలై రమేష్, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు అంజమ్మ, చౌడప్ప, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్


