ఏఐలో భాగస్వాములు అవుదాం
కెజీఎఫ్: ఆధునిక సాంకేతిక యుగంలో మార్పులకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని ధారవాడ ఐఐటీ ప్రముఖుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని టి.తిమ్మయ్య ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుపాటు నిర్వహించిన ఏఐ సాంకేతికత మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ సంస్థలు సమాచార, సాంకేతికత వ్యవహార క్షేత్రంలో ఇప్పటికే బలపడ్డాయని అన్నారు. సమాచారం, పాలనా వ్యవస్థ, ప్రమాదాల నిర్వహణను బలపర్చడానికి ఏఐ సాంకేతికత అత్యంత అవశ్యమన్నారు. ఈ మేళాలో 30 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తిమ్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి 12 బృందాలు పాల్గొని 116 మంది విద్యార్థులు తమ కౌశల్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ ఆరిఫ్, తదితరులు పాల్గొన్నారు.


