అడుగు తడబడితే.. జారి పడాలంతే
కోలారు: ఎటు చూసినా మురుగు నీరు పేరుకుపోయి బురదమయం కావడంతో అడుగు తడబడినా జారి పడాల్సి వస్తోంది. నగర సమీపంలోని విజయనగర కాలనీలో కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు పొంగి ప్రవహిస్తూ రహదారి పైకి చేరుతోంది. చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారంతా దుర్గంధం భరించలేకపోతున్నారు. దోమలు తీవ్రమై అనారోగ్యం పాలవుతున్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని చెబుతున్నారు. కల్వర్టు నిర్మాణం నిలిపివేయడంతో ఈ పరిస్థితి కలిగిందని, ఆ దారిన వెళ్లాలంటే ముక్కు మూసుకుని నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మురుగు నీరు రహదారిపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అడుగు తడబడితే.. జారి పడాలంతే


