వైభవంగా సిద్ధలింగేశ్వర జాతర
రాయచూరురూరల్: రాయచూరు తాలుకా మన్సలాపూర్‌లో సిద్ధలింగేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. వందలాది భక్తుల సమక్షంలో సిద్ధలింగేశ్వర స్వామిని రథంపై కొలువుంచారు. కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్ పురశంభు సోమనాథ శివాచార్యుల పూజల అనంతరం రథం లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
వీరభద్రేశ్వర స్వామి జాతర
రాయచూరురూరల్: నగరంలోని నేతాజీ నగర్‌లో వీరభద్రేశ్వర స్వామి జాతర, రథోత్సవం వైభవంగా జరిగాయి. వందలాది భక్తుల సమక్షంలో అభినవ రాచోటి శివాచార్యులు దేవాలయాల్లో విశేష పూజలు చేశారు. అనంతరం రథంపై స్వామిని కొలువుంచి లాగారు. కార్యక్రమంలో నగర సభ ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, రాచయ్యస్వామి, రవికుమార్, సావిత్రి పురుషోత్తం పాల్గొన్నారు.
వైభవంగా సిద్ధలింగేశ్వర జాతర


