బళ్లారి రైల్వే స్టేషన్‌కు 150 ఏళ్లు
సాక్షి, బళ్లారి: జాతిపిత, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మాగాంధీ సేద తీరిన బళ్లారి రైల్వే స్టేషన్‌కు 150 ఏళ్లు నిండాయి. బ్రిటీష్ హయాంలో నిర్మించిన ఈ బళ్లారి రైల్వే స్టేషన్ నేటికీ ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటక రాష్ట్ర రైల్వే క్రియా సమితి అధ్యక్షుడు కేఎం.మహేశ్వరస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బళ్లారి రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టి 150 ఏళ్లు గడచినా నేటికీ కొనసాగుతోందని గుర్తుచేశారు. ఘనమైన చరిత్ర కలిగిన స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 1921 అక్టోబర్, 1న జాతిపిత మహాత్మాగాంధీ ఈ రైల్వే స్టేషన్‌లోనే రాత్రంతా నిద్రించారన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైల్వే స్టేషన్ చరిత్ర తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరిదేదయ్య, బండేగౌడ, చంద్రశేఖర్‌గౌడ, గోపాల కృష్ణ, సొంత గిరిధర్, కేఎం కొట్రేష్, తదితరులు పాల్గొన్నారు.
బళ్లారి రైల్వే స్టేషన్‌కు 150 ఏళ్లు


