వైకల్యం వారికి బలహీనత కాదు
హొసపేటె: దివ్యాంగులకు వైకల్యం బలహీనత కాదు.. వారికి శారీరక వైకల్యంతోపాటు ప్రత్యేక సామర్థ్యం ఉంటుందని డిప్యూటీ కమిషనర్ కవితా ఎస్ మన్నికేరి అన్నారు. నగరంలోని వేంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులు శారీరకంగా బలహీనంగా ఉన్నా.. నాగరిక సమాజంలో అభివృద్ధి పథంలో సాగుతున్నారన్నారు. దివ్యాంగులను చేర్చే సమాజాలను సృష్టించడం... సమాజంలోని సవాళ్లకు ప్రతిస్పందించే మేధో సామర్థ్యం కల్పించడమే ఐక్యరాజ్య సమితి– 2025 నినాదం అన్నారు. ఏదో ఒక రంగంలో దివ్యాంగుల నైపుణ్యం గుర్తించి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ .రూపేష్‌కుమార్, కె.తిమ్మప్ప, రామాంజనేయ, విద్యార్థులు పాల్గొన్నారు.


