కుక్క కాటుకు యువతి బలి
సాక్షి, బళ్లారి: ర్యాట్ విలార్ కుక్క కాటుతో యువతి మృతి చెందిన సంఘటన దావణగెరె శివారు హొన్నూరు గొల్లరహట్టిలో చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గురువారం రాత్రి కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ర్యాట్ విలార్ జాతికి చెందిన రెండు కుక్కలను హొన్నూరు గొల్లరహట్టి వద్ద విడిచి వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన చిత్తూరు జిల్లా వివి.పాలెంకు చరెందిన అనిత(38)పై ఆ కుక్కలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. రక్తగాయాలతో పడిన ఆమెను స్థానికులు బంధువులు గుర్తించి బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. తుమకూరు జిల్లా శిరా తాలూకా ఆస్పత్రి శవాగారానికి మహిళ మృత దేహాన్ని శవ పరీక్ష జరిపారు. ఆమెకు సుమారు 50 చోట్ల కుక్కకాట్లు పడ్డాయి. ఆ కుక్కలు ఆ గ్రామ పొలంలోనే మకాం వేయడంతో గ్రామస్థులు వాటిని పట్టుకొని కాళ్లకు తాళ్లు బిగించి బంధించారు. నిర్లక్ష్యంగా కుక్కలను తెచ్చి గ్రామంలో వదలేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.


