దివ్యాంగులపై చిన్నచూపు తగదు
బళ్లారిటౌన్: సమాజంలో దివ్యాంగులపై చిన్నచూపు చూడకుండా వారి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా శ్రమించాలని జిల్లా న్యాయసేవా ప్రాధికార కార్యదర్శి న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా న్యాయసేవ ప్రాధికార, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సబలీకరణ తదితర శాఖల ఆధ్వర్యంలో జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వారే కొన్ని సందర్భాల్లో వారి జీవితంపై విరక్తి చెందుతారన్నారు. అయితే దివ్యాంగులు తమ అసహాయకత సందర్భంలో కూడా ధైర్యంగా జీవిస్తున్నారన్నారు.
దివ్యాంగులను ప్రోత్సహించాలి
దివ్యాంగులను తల్లిదండ్రులు వారికి ఇష్టమైన రంగంలో ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో స్వయం సేవా సంస్థలు దివ్యాంగుల పిల్లలను పాలన పోషణ చేస్తూ ఆసక్తి చూపడం శ్లాఘనీయం అన్నారు. దివ్యాంగులు కూడా పలు రంగాల్లో సాధన చేశారన్నారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారని గుర్తు చేశారు. అంతేగాక కళ, నృత్యం, క్రీడల్లో కూడా సాధన చేశారన్నారు. పాలికె మేయర్ పీ.గాదెప్ప మాట్లాడుతూ పాలికెలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జెడ్పీ ఉపకార్యదర్శి శశికాంత్ శివపురె, బ్రూస్‌పేట్ ఎస్‌ఐ మహంతేష్, ఏపీఎంసీ ఎస్‌ఐ మహమ్మద్ రఫిక్, అధికారులు రామకృష్ణ నాయక్, వీరేంద్రకుమార్, సవిత, వైఎం.సతీష్, కార్తీక్, జాఫర్ పాల్గొన్నారు.
న్యాయమూర్తి రాజేష్ ఎస్.హొసమని
దివ్యాంగులపై చిన్నచూపు తగదు


