కరుణించు కురువపుర వల్లభ
కృష్ణా నదీ తీరంలోని కురువపుర
రాయచూరు రూరల్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతి రూపమే దత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురుదేవ దత్త మొదటి అవతార పురుషుడు శ్రీవల్లభ స్వామి. కర్మభూమి ద్వీపకల్పంలో నివసించిన నాథుడిగా కురువపుర వల్లభ నాథుడు ప్రసిద్ధి చెందాడు. రాయచూరు తాలూకాలో తెలంగాణ సరిహద్దుల్లో కురవపుర కృష్ణా నది పాయల మధ్యలో వెలసింది. రాయచూరు నుంచి 25 కి.మీ.ల దూరం బస్సులో వెళ్లిన తర్వాత 20 నిమిషాల పాటు నదిలో నాటుపడవల్లో ప్రయాణించి కి.మీ. దూరం నడిచి భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. మరి కొంత మంది తెలంగాణలోని మక్తల్ నుంచి కురువపుర చేరుకుంటారు. తాలూకాలోని నారదగడ్డలో వెలసిన శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం భక్తులు బూడిదపాడు, ఆత్కూరు, దొంగరాంపూర్‌ల నుంచి కృష్ణా నదిలో నాటుపడవల్లో వెళతారు.
నేటి నుంచి దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు
దర్శించుకోనున్న నాలుగు రాష్ట్రాల భక్తులు
కరుణించు కురువపుర వల్లభ
కరుణించు కురువపుర వల్లభ
కరుణించు కురువపుర వల్లభ


