బళ్లారిటౌన్: నగరానికి చెందిన కన్నడ సంఘాల పోరాట నాయకుడు హెచ్.సురేష్‌కు ఆసియా ఇంటర్ నేషనల్ కల్చరల్ రిసెర్చ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు లభించింది. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 30న హోసూరు వద్ద గల అత్తిబెలెలో యూనివర్సిటీ వారు ఈ అవార్డును తనకు అందించినట్లు తెలిపారు.
భరతనాట్య
కళాకారిణికి అవార్డు
హొసపేటె: 2024–25వ సంవత్సరానికి బాలల దినోత్సవం సందర్భంగా 6 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా రంగ పోటీలలో భరత నాట్య ప్రదర్శన చేసిన వేదశ్రీ అనే విద్యార్థినికి జిల్లా స్థాయి పోటీల్లో కేళది చెన్నమ్మ అవార్డు లభించింది. విజయనగర జెడ్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఈఓ అక్రమ్ షా, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అధ్యక్షురాలు, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ డీడీ శ్వేత, విజయనగర జిల్లా స్థాయి ఎంపిక కమిటీ సభ్యులు, కార్యదర్శులు, సభ్యులు విద్యార్థికి అవార్డు సర్టిఫికెట్, జ్ఞాపికతో సత్కరించారు.
వేతనాలు చెల్లించరూ
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టాస్క్‌వర్క్స్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం తుంగభద్ర నీటిపారుదల శాఖ యరమరస్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు అజీజ్ మాట్లాడారు. యరమరస్, కల్లూరు, ఆర్డీఎస్, కవితాళ, కొట్నేకల్, మస్కి, సింధనూరు, జవళగేర, తుర్విహాళ్‌లోని టాస్క్ వర్క్స్ కార్మికులు ఐదునెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ శాఖాధికారి వినతిపత్రం సమర్పించారు.
మానవతా విలువలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: సమాజంలో విద్యార్థులు మానవతా విలువలను పెంచుకోవాలని మాజీ శాసన సభ్యుడు తిప్పరాజు పేర్కొన్నారు. మంగళవారం వేదాంత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలు మరిచి సామరస్యంతో జీవితం గడపాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువు, దైవం అనుభవాలతో మెలగాలన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రాకేష్ రాజలబండి, భీమేష్‌లున్నారు.
డాక్టరేట్ ప్రదానం
డాక్టరేట్ ప్రదానం
డాక్టరేట్ ప్రదానం


