రాష్ట్రానికి వర్షసూచన
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో చలి తీవ్రత నడుమ రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒళనాడు, కరావళి ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చు, ఉత్తర ఒళనాడు ప్రాంతంలో పొడి గాలులు వీస్తాయని తెలిపారు. బెంగళూరు మబ్బులు కమ్మేసి ఉంటాయని, అలాగే కొద్దిపాటి చిరుజల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కరావళి జిల్లాలు దక్షిణ కన్నడ, ఉడుపిలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. బెంగళూరులో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలు ఉండవచ్చు. గంటకు 6–13 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.


