రామబంటూ.. నీ వెంట మేమయ్యా
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం హనుమత్ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామికి అలంకారం, పూజలు, హోమాలు జరిపించారు. ఉదయం నుంచి దేవస్థానాలు భక్తులతో నిండిపోయాయి. రామబంటు అంజన్నకు ఇష్టమైన తులసి, తమలపాకు, వెన్న, ఉద్ది వడలతో విశేష అలంకరణ చేశారు. బెంగళూరు ఉత్తరహళ్లిలోని వీరాంజనేయస్వామి గుడిలో గణపతి హోమం జరిగింది. దాసనపుర కార్యసిద్ధి ప్రసన్న ఆంజనేయస్వామి మందిరంలో పంచామృత అభిషేకాలు జరిగాయి. దేవనహళ్లి తాలూకా బన్నిమంగల ఆంజనేయస్వామి గుడి, రాజఘట్ట, దిన్నే ఆంజనేయస్వామి మందిరాలలో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలో ఉండి దర్శించుకున్నారు. నగరవ్యాప్తంగా ఆంజనేయస్వామి మందిరాలలో భక్తుల కోలాహలం నెలకొంది. హనుమ వేషధారుల సందడి ఆకట్టుకుంది. రాష్ట్రమంతటా ఇదే రీతిలో హనుమజ్జయంతి పూజలు సాగాయి.
తుమకూరులో
తుమకూరు: తుమకూరు నగరంలో చరిత్ర ప్రసిద్ధ కోటె ఆంజనేయస్వామి దేవాలయం, శెట్టిహళ్ళి ఆంజనేయ స్వామి గుడి, అభయాంజనేయ స్వామి మందిరం, బీహెచ్ రోడ్డులో వరప్రసాద వీరాంజనేయ స్వామి తదితరాల్లో జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, హోమాలు చేపట్టారు.
ఘనంగా హనుమత్
జయంతి ఉత్సవాలు
ఆంజనేయ ఆలయాలలో భక్తుల రద్దీ
వాడవాడలా ఉత్సవాలు
రామబంటూ.. నీ వెంట మేమయ్యా
రామబంటూ.. నీ వెంట మేమయ్యా
రామబంటూ.. నీ వెంట మేమయ్యా


