కబ్బన్ పార్కులో పుష్ప ప్రదర్శన కమనీయం
పూల సొగసులను మొబైళ్లలో బంధిస్తున్న అతివలు
ఫ్లవర్ షోలో సందర్శకుల సందడి
హంపీ రాతి రథం పుష్ప ఆకృతి దాల్చింది
శివాజీనగర: బెంగళూరులోని కబ్బన్ పార్కులో ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన కనువిందు చేస్తోంది. పుష్పాల పండుగ– కళా సంస్కృతి పేరిట 11 రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీష్ గురువారం ప్రారంభించారు. ఫల పుష్ప ప్రదర్శనలో వినియోగించిన పుష్పాలను తొలగించకుండా వాటిని ఎండబెట్టడం గానీ, సంస్కరించి పునర్ వినియోగ్యమైన వస్తువులను తయారు చేయాలని ఆమె సూచించారు. ప్రత్యేకంగా పిల్లల కోసం పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రకృతితో కలిసి జీవిస్తే వచ్చే ఆనందాన్ని ఈ పుష్ప ప్రదర్శన తెలియజేస్తుందన్నారు. కబ్బన్ పార్కు సుందర ప్రకృతిలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనకు అందరు విచ్చేసి వీక్షించాలని సూచించారు.
కబ్బన్ పార్కులో పుష్ప ప్రదర్శన కమనీయం
కబ్బన్ పార్కులో పుష్ప ప్రదర్శన కమనీయం
కబ్బన్ పార్కులో పుష్ప ప్రదర్శన కమనీయం
కబ్బన్ పార్కులో పుష్ప ప్రదర్శన కమనీయం


