30న ఆరెంజ్ వరల్డ్ వాకథాన్
హొసపేటె: మహిళలపై హింసకు గురవుతున్న వారి హృదయాలను బలోపేతం చేయడానికి నగర ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 30న ఆరెంజ్ వరల్డ్ వాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు వాకథాన్ ప్రచార అధ్యక్షుడు మణి విష్ణు అన్నారు. నగరంలోని పత్రికా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై చాలా దారుణాలు జరుగుతున్నాయన్నారు. అనేక సందర్భాల్లో మహిళలు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు. బాధితులను ఓదార్చడానికి సంకోచం లేకుండా ధైర్యంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం క్లబ్ అధ్యక్షురాలు నైమిషా మాట్లాడుతూ 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు జిల్లా స్టేడియం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ వాకథాన్ కార్యక్రమాన్ని బిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, సోషల్ వర్కర్ రష్మి రాజశేఖర్ హిట్నాల్, ఇన్నర్ వీల్ క్లబ్ 316 జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ రాజగోపాల్ తదితరులు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. వాక్‌థాన్ డాక్టర్ అంబేడ్కర్ సర్కిల్ గుండా సాగి పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వద్ద భారీ మానవ హారంగా ఏర్పడి, స్టేషన్ రోడ్‌లోని రోటరీ క్లబ్‌కు చేరుకుంటుంది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే హెచ్‌ఆర్.గవియప్ప పాల్గొంటారన్నారు.


