● ఘాటిలో భక్తజన కోటి
నాగుల విగ్రహాలకు భక్తుల పూజలు
యశవంతపుర: చంపాషష్టి పర్వదినం సందర్భంగా బుధ, గురువారాలు ఘాటి సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తులు సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంతో పాటు సుబ్రమణ్య, నరసింహస్వామికి విశేష పూజలు జరిగాయి. ఆలయ ఆవరణలోని పాముపుట్ట, నాగుల విగ్రహాలకు భక్తులు పూజలు చేశారు.
డిసెంబరులో బ్రహ్మ రథోత్సవం
ఘాటి బ్రహ్మరథోత్సవాన్ని వచ్చే నెల 25న నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 10 నుంచి 18 వరకు ఎద్దుల పరుస జరుగుతుంది. ఈదఫా ఎద్దుల పరుసకు వచ్చే ఎద్దులు, వాహనాల మీద సుంకాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఎద్దులతో వచ్చే రైతులకు ఆలయం ద్వారా అన్నదానం జరుపుతారు.
ఘనంగా చంపా షష్టి వేడుకలు
● ఘాటిలో భక్తజన కోటి


