రాజ్యాంగంతోనే అందరికీ సమానత
జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు
పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న మాజీ మేయర్ తదితరులు
స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో విద్యార్థులు
సాక్షి, బళ్లారి: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే, అంతకు ముందు 1949 నవంబర్ 26వ తేదీన పార్లమెంట్‌లో భారత రాజ్యాంగానికి ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో 2015లో భారత ప్రభుత్వం ప్రతీ సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుండటం సంతోషంగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో జిల్లా పంచాయతీ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులచే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాల్లో విద్యార్థులు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతాలో జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, మేయర్ గాదెప్ప తదితరులు సైకిల్‌పై వెళ్తూ భారత జెండాలను పట్టుకొని ప్రజలను ఉత్తేజపరిచారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో జాతాలో పాల్గొని స్వాతంత్య్రం, రాజ్యాంగంకు సంబంధించిన నినాదాలు చేశారు. భారత దేశ స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రజలను చైతన్యపరిచారు.
రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడాలి
రాయచూరు రూరల్: భారత రాజ్యాంగాన్ని పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ప్రతిమకు పూలమాల వేసి మాట్లాడారు. భారత దేశ రాజ్యాంగాన్ని గౌరవించిన ఇతర దేశాలు మన చట్టాలను, ఉత్తర్వులను అనుసరిస్తున్నాయన్నారు. భారతదేశం గణతంత్ర దేశంగా ఉన్న రాజ్యాంగ పరంగా ఉన్న చట్టాలను మనం గౌరవించాలన్నారు. శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, దద్దల్ బసనగౌడ, అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, సుజాత, అధికారులు సురేంద్ర బాబు, చేతన్ కుమార్, చంద్రశేఖర్, రాజేంద్ర జాలదార్‌లున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి శాంతప్ప పూలమాల వేసి ప్రతిజ్ఞ ప్రమాణం చేశారు.
దినోత్సవంలో పలువురు వక్తల కితాబు
వాడవాడలా ఘనంగా భారత
రాజ్యాంగ ఆమోద దినం ఆచరణ
రాజ్యాంగంతోనే అందరికీ సమానత
రాజ్యాంగంతోనే అందరికీ సమానత
రాజ్యాంగంతోనే అందరికీ సమానత
రాజ్యాంగంతోనే అందరికీ సమానత
రాజ్యాంగంతోనే అందరికీ సమానత


