● కుక్కే సుబ్రమణ్యా.. శుభంకరా
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లాలోని కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో చంపా షష్టి మహోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉదయం 7:29 గంటలకు ముహూర్తంలో వైభవంగా చిక్క రథోత్సవం జరిగింది. ఉమామహేశ్వరదేవిని ఊరేగించారు. అనంతరం చంపా షష్ఠి మహా రథోత్సవంలో సుబ్రమణ్యస్వామిని బ్రహ్మరథంపై కూర్చోపెట్టి తేరును లాగారు. హరిహర సుబ్రమణ్య, స్కంధ సుబ్రమణ్య అంటూ జైకారాలు చేశారు. నాణేలు, పూలు, పండ్లను తేరు మీదకు విసిరారు. పొరుగున ఉండే కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
● కుక్కే సుబ్రమణ్యా.. శుభంకరా


