వలస పక్షుల విహారం
బోనాళ పక్షిధామలో
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో విదేశీ పక్షుల సందడి అధికంగా చోటు చేసుకుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల నుంచి విదేశీ పక్షుల కలరవం బోనాళ పక్షిధామలో కనబడుతోంది. పచ్చని వాతావరణం మధ్య నైసర్గిక స్వరూపంతో కూడిన ధామలో వివిధ రకాలైన పక్షుల కలరవం వినబడుతోంది. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతి విశాలమైన యాదగిరి జిల్లా సురపుర తాలూకా బోనాళ వద్ద గల పక్షిధామలో అందరినీ ఆకర్షిస్తుంది. పచ్చని వాతావరణంలో పరిసరాలకు తగ్గట్టుగా ఆహారం సేకరణకు తోడు చెరువులో పక్షుల విడిది అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. కామన్ కూట్, పర్పల్ మోర్, హెన్ స్ట్రోక్, ప్రైడ్ కింగ్‌ఫిషర్, పూండ్ హిరోన్, ఇగ్రేట్, డార్టర్, కమోకాంట్ష్, వాటర్ హెన్, బ్లాక్ హెడెడ్ ఐబిస్, లాపవింగ్, రివర్ టర్న్, వాగ్టైల్ వంటి పక్షుల సందడి చెప్పనలవి కాదు.
యాదగిరి జిల్లాలో
విదేశీ పక్షుల సందడి
చూపరులకు
కనువిందు చేస్తున్న వైనం
వలస పక్షుల విహారం


