సాఫ్ట్‌వేర్ కంపెనీల స్థాపనకు ఎంపీ ఆహ్వానం
బళ్లారి రూరల్ : బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్– 2025లో మంగళవారం దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున పాల్గొని దావణగెరె నగరంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలను స్థాపించడానికి వివిధ కంపెనీలను ఆహ్వానించారు. ఇందులో భాగంగా దావణగెరెలో ఐటీ, బీటీ కంపెనీల స్థాపన, అభివృద్ధి గురించి సంబంధిత మంత్రి ప్రియాంక్ ఖర్గేతో మాట్లాడారు. గత నెలలో దావణగెరెలో జరిగిన టెక్ రేస్ గురించి మంత్రి అడిగి తెలుసుకొన్నారు. దావణగెరెలో సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఏర్పాటు చేసే సంస్థలకు తగిన సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ తెలిపారు. సమ్మేళనంలో దావణగెరె జిల్లాధికారి జీఎం గంగాధరస్వామి, జెడ్పీ సీఈఓ మాధవ్ విఠల్ రావు, బీఐటీ కళాశాల ప్రిన్స్‌పాల్ హెచ్.బి.అరవింద్, దావణగెరె విజన్ టీమ్ సభ్యులు వీరేశ్ పటేల్, డాక్టర్ ప్రశాంత్, సీ.సతీష్‌కుమార్, డాక్టర్ వినయ్ ఎం.టీ, డాక్టర్ ఫణికృష్ణ, గిరీశ్‌లు పాల్గొన్నారు.


