కిలాడీచే రూ.1.29 కోట్లు హాంఫట్
శివాజీనగర: సైబర్ నేరాలు అధికమై ప్రజలు కోట్ల రూపాయల సొమ్మును కొన్ని గంటల్లో కోల్పోతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్ లో మహిళ తీయని మాటలకు వలలో పడి రూ.1.29 కోట్లకు పైగా నష్టపోయాడు.
వివరాలు.. సి.జగదీశ్ (42) బాధితుడు. ఇతనికి క్వాక్ క్వాక్ అనే డేటింగ్ యాప్‌లో గుర్తు తెలియని ఓ వ్యక్తి పరిచయమయ్యారు. మేఘన అనే యువతి అతనితో తరచూ మాట్లాడుతూ మభ్యపెట్టింది. మీతో డేటింగ్ చేస్తానని చెప్పడంతో అతడు ఊహల్లో తేలిపోయాడు. అయితే తమ ద్వారా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు వస్తాయని ప్రేరేపించింది. అలాగే తన తండ్రి పేరుతో వృద్ధాశ్రమం స్థాపిస్తానని, ఇందుకు సహాయం చేయాలని జగదీశ్ నుంచి తరచూ డబ్బులు బదిలీ చేసుకుంది. నవంబర్ 5, 6 తేదీలలో జగదీశ్ ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఫ్‌టీ ద్వారా వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ. 1,29,33,253 ను మేఘన చెప్పిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు.
ఫోన్లు స్విచాఫ్..
సొమ్ము బదిలీ తరువాత కిలాడీ మేఘన ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. జగదీశ్ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. సొమ్ము వెనుతిరిగి రాకపోవటంతో మోసం తెలుసుకొన్న జగదీశ్ ఉత్తర విభాగం సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
బెంగళూరువాసికి డేటింగ్
యాప్‌లో పరిచయం
పెట్టుబడుల పేరుతో వసూళ్లు


