ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
హొసపేటె: యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి, అలాగే వారికి మరింతగా విజ్ఞానాన్ని పెంపొందించడానికి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడుతాయని టీబీ డ్యాం పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ మనోహర్‌లాల్ జీన్‌గర్ తెలిపారు. గురువారం పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మొత్తంగా 50 పైగా సమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నగరంలోని పలు ప్రైవేట్ పాఠశాలల నుంచి బాలబాలికలు తరలివచ్చారు. భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్స్ శాఖ నుంచి అత్యవసర సమయాల్లో ఉపయోగించే సెన్సార్ ఆధారిత నీటి స్ప్రింకర్లు పియానో, ఆటోమేటిక్ డస్ట్‌బిన్, కూలర్, సౌరవ్యవస్థ నమూనాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ మనోహర్‌లాల్ జీన్‌గర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్, రాజశేఖర్, అబ్తాబ్, ఆసియా సుల్తాన్, దీపిక, అనుపమా, గులాం ముస్తాఫా, అంజలి, రమిజా, సునీత, సంగమ, అభిషేక్, నిఖిత, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్


