వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేనివి
బళ్లారి రూరల్: స్వతంత్య్ర భారత్ ఏకీకరణకు సూత్రధారి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఏఎస్‌ఎం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధూపం సతీష్ తెలిపారు. శుక్రవారం ఏఎస్‌ఎం కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మొదటి ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని సేవలు అందించారన్నారు. యావత్తు భారతదేశాన్ని ఏకతాటికి తేవడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సేవలకు గుర్తుగా సర్ధార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, స్కౌట్స్ అండ్ గౌడ్స్, ప్రముఖులు పాల్గొన్నారు.
బళ్లారి టౌన్: అఖండ భారత ఐక్యతకు కారకుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయి పటేల్ అని జిల్లా ఎస్పీ శోభరాణి పేర్కొన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీఏఆర్ పోలీస్ గ్రౌండ్‌లో రన్ ఫర్ యూనిటీ మారథాన్ నిర్వహించారు. జిల్లా పంచాయతీ పీఈఓ మహమ్మద్ హ్యారీష్ సుమేరా మాట్లాడుతూ.. యువత ఆన్‌లైన్ గేమ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మారథాన్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు.
హొసపేటె: నగరంలోని పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారి కవితా ఎస్.మన్నికేరి మాట్లాడుతూ.. ఐక్యత అనేది ఒకేసారి జరిగే కార్యక్రమం కాదని.. జాతీయ పునరుద్ధరణకు నిరంతర ప్రయత్నం అని తెలిపారు. దేశ వ్యాప్తంగా పాఠశాలలు పౌర సంస్థలు, పౌరులు దేశ సమగ్రతను నిలబెట్టాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. అనంతరం నగరంలో ప్రముఖ వీధుల్లో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్పీ జాహ్నవి తదితరులు అధికారులు పాల్గొన్నారు.
రాయచూరు రూరల్: నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరా గాంధీ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వసంత్‌కుమార్, గ్రామీణ సభ్యుడు బసన గౌడ దద్దల్, నగరాద్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నగర సభ కమిషనర్ జుబీన్ మెహపాత్రో తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు వీరన గౌడ ఆధ్వర్యంలో వల్లభాయి పటేల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేనివి
వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేనివి
వల్లభాయ్ పటేల్ సేవలు ఎనలేనివి


