బళ్లారి టౌన్: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వెంటనే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక రాయల్ సర్కిల్ నుంచి ర్యాలీగా జిల్లా అధికారి కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లాధ్యక్షుడు గోవింద్ మాట్లాడుతూ.. దిగుబడి బాగానే ఉన్నా సరైన ధర లేక పోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరతో మొక్కజొన్నను ఖరీదు చేసి ఎక్కువ ధరతో అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి గురళ్లి రాజు, రైతు నేతలు బసవరాజు, పంపాపతి, హొన్నూర్ మల్లికార్జున, మహబూసాబ్ తదితరులు పాల్గొన్నారు.


