పేదలకు సేవ చేస్తాం
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో దారి తప్పుతున్న భక్తులకు స్వామిజీలు ధర్మ సందేశాలు ఇవ్వాలని బాళే హోన్నురు రంబాపుర పీఠాధిపతి జగుద్గరు ప్రసన్న రేణుక వీర సోమేశ్వర రాజ దేశీ కేంద్ర శివాచార్యలు సూచించారు. శుక్రవారం కిల్లే బ్రహన్మఠ మఠంలో గురుపాదేశ్వర 25 పుణ్యారాధన నిర్వహించారు. బడుగు, బలహీన, దళిత వర్గాలు సామాజికంగా వెనుకబడిన పేదలకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నామని స్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, చంద్రశేఖర్ పాటిల్, సమాజం అధ్యక్షుడు శరణ భూపాల నాడగౌడ, వీరభద్రప్ప గౌడ, శరణగౌడ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలతో అసభ్య ప్రవర్తన
చెళ్లెకెరె రూరల్: నగరంలోని త్యాగరాజ నగర్‌లో ఓ వ్యక్తి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నడి వీధిలో నగ్నంగా తిరుగుతూ మహిళలను భయ భ్రాంతులకు గురి చేశాడు. దీందతో మహిళలు భయపడి ఇళ్లలోకి పారిపోయారు. వికృతి కామి వికృత చేష్టలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చెళ్లెకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.
కరువు ప్రాంతంగా ప్రకటించాలి
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం గౌరవాధ్యక్షుడు మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో వేసిన వరి, కంది, పత్తి పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. పంటలు నాశనం కావడంతో పరిహారం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అనంతరం పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు.
పేదలకు సేవ చేస్తాం


