బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ల
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో బాలల మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి. అదృశ్యమైన పిల్లల ఆచూకీ మిస్టరీగా మారుతోంది. వారు ఎలా మాయమవుతున్నారు? ఎవరు మాయం చేస్తున్నారు? ఎందుకు మాయం చేస్తున్నారు? అనే విషయాలు అంతుబట్టడం లేదు. కనబడకుండాపోతున్న పిల్లల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోంది. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు తమ చెంతకు ఎప్పుడు చేరుతారోనని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు.
మిస్సింగ్ కేసుల సంఖ్య ఇలా...
హోంశాఖ సమాచారం ప్రకారం 2020 నుంచి 2025(జూలై)వరకూ 14,878 మంది పిల్లలు మాయమయ్యారు. వీరిలో 13,542మంది పిల్లల ఆచూకీ లభించింది. వారు తల్లితండ్రుల వద్దకు క్షేమంగా చేరారు. 2025 జూలై చివరికి మొత్తం 2,170మంది పిల్లలు కనబడకుండాపోయారు. వీరిలో 551 మంది మగపిల్లలు, 1,619మంది ఆడపిల్లలు ఉన్నారు. గత ఐదున్నరేళ్ల కాలంలో అదృశ్యమైన 10,792మంది బాలికలపైకి 1003మంది, అదేవిధంగా 4086 మంది మగ పిల్లలపైకి 333మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
ఈ జిల్లాలో ఎక్కువ కేసులు
పిల్లలు మాయమవుతున్న కేసులను చూస్తే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత దావణగెరె, ఉడుపి, దక్షిణకన్నడ, హావేరి, చిత్రదుర్గ, తుమకూరు, మైసూరు జిల్లాలు ఉన్నాయి.
మాయమవుతున్న బాలలు
మిస్సింగ్ కేసుల్లో బెంగళూరు ఫస్ట్
పత్తాలేని వెయ్యి మంది ఆడపిల్లలు
హోం శాఖకు లేఖ రాశాం
కనబడకుండాపోయిన పిల్లలను త్వరగా కనిపెట్టి తీసుకురావాలని లేఖలు రాయడం ద్వారా హోం శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నామని, రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ కమిటీ అధ్యక్షుడు నాగణ్ణగౌడ తెలిపారు.
చైతన్యం తీసుకు వస్తున్నా...
పిల్లల హక్కులు, సంరక్షణ తదితర అంశాలపై ప్రభుత్వం ప్రచారం ద్వారా చైతన్యం కలిగిస్తున్నా పిల్లలు మాయమవుతూనే ఉన్నారు. ఆడపిల్లలు అధిక సంఖ్యలో మాయమవడానికి కారణం సెక్స్ మాఫియా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆడపిల్లలను వేశ్యావాటికకు తరలించి డబ్బు దండుకునే మాఫియా దేశ వ్యాప్తంగా విస్తరించింది. అదే ఆడపిల్లలను విదేశాలకు పంపించి విక్రయించే మాఫియా కూడా ఉంది. ఇక లెక్కకు దొరకని, కనబడకుండాపోయిన పిల్లల సంఖ్య ఎంత ఉందో ఊహించుకోవచ్చు.
బాలల అదృశ్యానికి అనేక కారణాలు
తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం, కుటుంబ కలహాలు, పరిపక్వత లేని ప్రేమ, పిల్లల పట్ల కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం, పేదరికం, గ్రామీణ జీవితం పట్ల విరక్తి,నగర జీవితాల పట్ల ఆకర్షణ ఇలా అనేకం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలను భిక్షాటన కోసం వాడుకునే మాఫియా దేశ వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆ మాఫియా కూడా పిల్లల అదృశ్యానికి కారణంగా చెప్పుకోవచ్చు.
బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ల
బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ల
బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ల
బడికి వెళ్లిన, లేదా ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్ల


