మహిళ కేసు.. ఎస్‌ఐ సస్పెండ్
బనశంకరి: మహిళపై అత్యాచారం ఆరోపణలతో డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సునీల్ ను సోమవారం నగర పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ సస్పెండ్ చేశారు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నామని సింగ్ తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్‌ఐ సునీల్ పై కొన్నిరోజుల క్రితం మైనారిటీ వర్గానికి చెందిన మహిళ అదే ఠాణాలో ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాను బ్యూటిషియన్‌గా పనిచేస్తానని, పని మీద ఓ సారి ఠాణాకు వెళ్లగా ఎస్‌ఐ సునీల్ ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టాడని ఆమె ఆరోపిస్తోంది. డీజీపీ సలీంకు కూడా ఫిర్యాదు పంపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్‌ఐని, ఆయనకు కొమ్ముకాసిన ఏఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు.


