వణికించిన భారీ వర్షం
రాయచూరు రూరల్: జిల్లాలో శుక్ర, శనివారాల్లో తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రోడ్లు బురద గుంటలుగా మారాయి. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు జామున 2 గంటల వరకు వర్షం పడింది. లోతట్టు ప్రాంతంలోని జలాల్ నగర్, మున్నూరు వాడి, లాల్ పహాడ్, మహావీర చౌక్, దేవినగర్, మడ్డిపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. నగరసభ మాజీ సభ్యులు తిమ్మారెడ్డి, శాలం కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వాన నీటిని మళ్లించడానికి చర్యలు తీసుకోవాలని నగరసభ అధికారులకు సూచనలు జారీ చేశారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వానలకు వాగులు, వంతెనలు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఇడపనూరు, పుచ్చలదిన్ని, మిడగలదిన్ని, గదార, యరగేర, బిచ్చాలి, యడ్లాపుర మధ్య రహదారి కోతకు గురైంది. మరో వైపు వర్షాలు కురవడంతో వరి పైరు నేలకొరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొప్పళ తాలూకా బసాపుర రైతు లక్ష్మణ్ రాజారాం పేట పొలంలో క్రిమి సంహారక మందును తాగడానికి ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం అతివృష్టి కురవడం, శుక్రవారం సాయంత్రం అకాల వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. నేలవాలిన పంటను చూడలేక రైతు ఆత్మహత్యాయ త్నానికి పూనుకున్నారు.
లోతట్టు కాలనీలు జలమయం
వర్షం దెబ్బకు నేలకొరిగిన వరి పైరు
కొప్పళ జిల్లాలో రైతు
ఆత్మహత్యాయత్నం
వణికించిన భారీ వర్షం
వణికించిన భారీ వర్షం


