రైలు ప్రయాణం.. నరకప్రాయం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో రైలు ప్రయాణికులకు తిప్పలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి యాదగిరి, రాయచూరు రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు బోగీలు ప్రయాణికులతో పూర్తిగా నిండిపోవడంతో కింద పడుకొని పిల్లా పాపలతో ప్రయాణం చేశారు. లాతూర్ నుంచి బెంగళూరు వరకు వెళ్లే రైలులో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల నుంచి జీవనోపాధి కోసం వెళ్లే వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. పండుగ సమయంలో అదనపు రైళ్లను నడపకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసం అదనపు బోగీలను కూడా అమర్చకుండా ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలున్నాయి.
రైలు ప్రయాణం.. నరకప్రాయం


