పలు జిల్లాల్లో తుపాను వర్షాలు | - | Sakshi
Sakshi News home page

పలు జిల్లాల్లో తుపాను వర్షాలు

Oct 26 2025 8:35 AM | Updated on Oct 26 2025 8:35 AM

పలు జ

పలు జిల్లాల్లో తుపాను వర్షాలు

అన్నదాతలకు కష్టం

యశవంతపుర: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో కన్నడనాట పలుజిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఉత్తరకన్నడ జిల్లా కరావళిలో కుండపోత కురుస్తోంది. గాలివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంకోలా తాలూకా హరవాడలో 24 గంటల్లో 80 మిల్లీమీటర్ల వర్షం దంచికొట్టింది. బెళెకెరిలో 76 మి.మీ, కుమలా–73 మి.మీ వర్షపాతం నమోదైంది. కారవారలో శనివారం ఉదయం రైల్వేస్టేషన్‌ మార్గం నీటమునిగింది. రాయచూరు, దక్షిణ కన్నడ, విజయపుర, గదగ్‌లోనూ భారీ వానలు పడ్డాయి. వరి, జొన్న, ఉల్లి తదితర పంటలకు తీవ్ర నష్టం కలుగుతోంది.

డ్యాములు ఫుల్‌

మైసూరు: కేరళలోని వైనాడు, పశ్చిమ కనుమల్లోని అటవీ ప్రాంతంలో నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందున కావేరి, ఉప నదులకు వరద పోటెత్తింది. జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకా బీచనహళ్లి గ్రామంలోని కబిని జలాశయం ఈ ఏడాదిలో ఐదోసారి పూర్తిగా నిండి కొత్త రికార్డును లిఖించింది. ఈ డ్యాం 50 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారిగా మే నెలలోనే నిండింది. తరువాత జూన్‌, జూలై, ఆగస్టు, తాజాగా అక్టోబర్‌ నెలాఖరులో డ్యాం నిండింది.ఇంకా రెండు మూడు నెలల పాటు జలాశయ నిండుగా ఉంటుందని అధికారులు తెలిపారు. కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండ్య జిల్లాలోని కేఆర్‌ఎస్‌ డ్యాంలో పలు గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు.

పలు జిల్లాల్లో  తుపాను వర్షాలు 1
1/1

పలు జిల్లాల్లో తుపాను వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement