ఈ ఏడాది కంది పంటకు రోగం సోకడంతో పాటు అతివృష్టి, ఈదురు గాలులతో నష్టపోయిన రైతులకు సర్కార్ మద్దతు ధరలు ప్రకటించి, ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలి. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు పరిచి మద్దతు ధర కల్పించాలి. ముఖ్యమంత్రి కార్పస్ ఫండ్ నుంచి పరిహారం అందించాలి.
– శరణ బసప్ప, కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లాధ్యక్షుడు
పంటకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి
కళ్యాణ కర్ణాటకలో కంది పంటకు రోగం సోకి నష్టాల బారిన పడి అప్పుల ఊబిలో చిక్కిన రైతులకు శాసీ్త్రయ ధరలు ప్రకటించాలి. ప్రకృతి వైపరీత్యాలకు అనుగుణంగా పంటల రక్షణకు సలహా, సూచనలివ్వడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. వానలు అధికంగా కురవడం, ఈదురు గాలులు వీయడంతో పూత రాలిపోయింది. – భీమా శంకర్, కిసాన్ సభ సంచాలకుడు
కంది రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి


