విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

Oct 26 2025 8:27 AM | Updated on Oct 26 2025 8:27 AM

విద్య

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

బళ్లారి రూరల్‌: ఇంజినీరింగ్‌లో ఐఈఈఈ విద్యార్థులు అత్యాధునిక అవకాశాలతో వృత్తిశీల నైపుణ్యాన్ని సాధించాలని బెంగళూరు దయానంద సాగర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ డీన్‌, అకడమిక్‌ అండ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ అన్నపూర్ణ పి.పాటీల్‌ తెలిపారు. శుక్రవారం ఆర్‌వైఎంఈసీలో జాతీయ స్థాయి ఐఈఈఈ దినోత్సవ ఆచరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐఈఈఈ విద్యార్థులు నెట్‌వర్కింగ్‌, అత్యాధునిక పరిశోధనలు వృత్తిశీల అభివృద్ధికి ఎంతో సహకరిస్తాయన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రగతిని సాధించాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కణేకల్‌ మహంతేశ్‌, పాలక మండలి అధ్యక్షుడు జానెకుంటె బసవరాజు, కార్యదర్శి డాక్టర్‌ అరవింద్‌ పాటిల్‌, సహకార్యదర్శి యాళ్పి మేటి పంపనగౌడ, కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హనుమంతరెడ్డి, వైస్‌ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సబితా సోనాలి తదితరులు పాల్గొన్నారు.

దంత పరీక్ష శిబిరం

రాయచూరు రూరల్‌: నగరంలో ఉచిత దంత ఆరోగ్య చికిత్స శిబిరాన్ని ప్రముఖ దంత వైద్యురాలు జయశ్రీరెడ్డి చేపట్టారు. శనివారం నగరంలోని జైన్‌ మందిర్‌ రహదారిలోని ఆస్పత్రిలో దంత వ్యాధులపై ఉచిత పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మొదటి రోజున 25 మందికి ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేశారు.

బళ్లారిలో జువెల్స్‌లో సోదాలు

సాక్షి బళ్లారి: కేరళ శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారాన్ని అక్రమంగా బళ్లారిలోని రొద్దం జువెల్స్‌లో అమ్మకం జరిగినట్లు సిట్‌ అధికారులకు తెలియడంతో సదరు అంగడిలో సోదాలు చేశారు. బళ్లారి నగరంలోని రొద్దం జువెల్స్‌లో 475 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు అంగడి యజమాని గోవర్ధన్‌ సిట్‌ అధికారుల ముందు ఒప్పుకొన్నారు. తనకు అయ్యప్పస్వామి ఆలయానికి చెందిన బంగారమని తెలియదని చెప్పాడు. సిట్‌ అధికారులు విచారణ జరిపి, మళ్లీ పిలిస్తే తప్పకుండా రావాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

బళ్లారి రూరల్‌ : బళ్లారి టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని పోలీస్‌ జింఖానాలో రాష్ట్ర స్థాయి వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను జిందాల్‌ ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ బి.పెద్దన్న ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం చేకూరుతుందన్నారు. ఈ పోటీల విజేతలకు జిందాల్‌ ఫౌండేషన్‌ ట్రోఫీలను, ఆరు టేబుల్‌ టెన్నిస్‌ బోర్డులను, ఇతర పరికరాలను అందజేసింది. పోటీల్లో బళ్లారి టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రముఖులు, టెన్నిస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

నదిలో యువకుడు జలసమాధి

గుమ్మఘట్ట: సరదాగా నదిలో స్నానానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న సరిహద్దు కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ఆంధ్ర, కర్ణాకట నుంచి నిత్యం సందర్శకులు వస్తుంటారు. యువకులు నీటిని చూసి ఊరుకోలేక ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. అయినా సంబంధిత శాఖల అధికారుల్లో మచ్చుకై నా చలనం కనిపించడం లేదని బాధిత తల్లిదండ్రులు, ప్రజలు విమర్శిస్తున్నారు. రాయదుర్గం పట్టణానికి చెందిన ఫయాజ్‌, హమాన్‌, నోమిన్‌ అనే యువకులు శనివారం బైక్‌లో ప్రాజెక్టు వద్దకు వచ్చారు, వేదావతి హగరికి వెళుతున్న నీటిలోకి దిగారు, వీరిలో ఫయాజ్‌ (20) ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోవడంతో చనిపోయాడు. సనావుల్లా, ఫాతిమా దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కావడంతో వారు గుండెలవిసేలా రోదించారు.

విద్యార్థులు వృత్తిశీల  నైపుణ్యత సాధించాలి1
1/4

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

విద్యార్థులు వృత్తిశీల  నైపుణ్యత సాధించాలి2
2/4

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

విద్యార్థులు వృత్తిశీల  నైపుణ్యత సాధించాలి3
3/4

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

విద్యార్థులు వృత్తిశీల  నైపుణ్యత సాధించాలి4
4/4

విద్యార్థులు వృత్తిశీల నైపుణ్యత సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement