
కారు పోయిందే!
తుమకూరు: భారీ వర్షాలకు జిల్లాలో చెరువులు, కాలువలుపొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షపు నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటన గుబ్బి తాలూకా తోటసాగర వద్ద జరిగింది. వివరాలు.. తోటసాగర గ్రామవాసి మంజునాథ్ కారు డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. గ్రామం నుంచి వెళ్తుండగా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కారు పక్క నుంచి వేగంగా టెంపో వెళ్లడంతో మంజునాథ్ అదుపుతప్పడంతో కారు వాగులోకి పడి కొట్టుకుపోసాగింది. మంజునాథ్ వెంటనే కారు నుంచి బయటకు వచ్చి ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడు. అయితే కారు మాత్రం నీటిలో సుమారు ఒక కిలోమీటర్ వరకు కొట్టుకుని పోయింది. సుమారు రెండు గంటల పాటు శ్రమించి కారును స్థానికులు బయటకు తీశారు.