
చెరువులోకి పడిన చిన్నారులు..
తుమకూరు: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణనష్టం తప్పదు. చిక్కనాయకనహళ్లి తాలూకా యరేకట్టె గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు పడి తండ్రి, కుమార్తె, మరో బాలిక చనిపోయారు. వివరాలు.. వెంకటేశ్ (43) కూతురు శ్రావ్య (12), స్నేహితురాలు పుణ్య (11) మంగళవారం సాయంత్రం 6 గంటలకు గ్రామం వద్ద ఉన్న చెరువుకు వెళ్లారు. అయితే నీటిలోకి జారిపడిపోయారు. వారి వెంట ఉన్న మరో బాలిక ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో వెంకటేశ్ బాలికలను కాపాడాలని పరిగెత్తుకుని వచ్చి చెరువులోకి దూకాడు. పుణ్యను బటయకు తీసుకువచ్చి మళ్లీ చెరువులోకి వెళ్లాడు, కానీ అలసిపోయి మునిగిపోయాడు. స్థానికులు గాలించగా వెంకటేశ్, కూతురు శ్రావ్య మృతదేహాలు బయటపడ్డాయి. పుణ్యను ఆస్పత్రిలో చేర్పించగా ఆమె కూడా చనిపోయింది. ఎమ్మెల్యే సీబీ సురేశ్ బాబు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. హందనకెరె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
కాపాడాలని తండ్రి ప్రయత్నం.. ముగ్గురూ మృతి

చెరువులోకి పడిన చిన్నారులు..