చిచ్చు రేపిన టపాసులు | - | Sakshi
Sakshi News home page

చిచ్చు రేపిన టపాసులు

Oct 23 2025 6:23 AM | Updated on Oct 23 2025 6:23 AM

చిచ్చ

చిచ్చు రేపిన టపాసులు

బెంగళూరు పరిసరాల్లో 150 మందికి గాయాలు

ఎక్కువమందికి కళ్లకు దెబ్బలు

బెంగళూరులో ఓ ఆస్పత్రిలో బాలునికి పరీక్షలు

శివాజీనగర: దీపావళి టపాసులు పేలుతుంటే చూడడం నేత్రానందాన్ని కలిగిస్తుంది కానీ, ప్రమాదం జరిగితే సంకటం తప్పదు. దీపావళి సంబరాలలో విషాదాలూ జరిగాయి. బెంగళూరులో గత మూడు రోజుల నుంచి బాణసంచా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టపాసులు వల్ల గాయపడినవారి సంఖ్య అధికమైంది. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో 150 మందికి పైగా కంటి హాని కేసులు నమోదయ్యాయి. 60 శాతం కేసులు టపాసుల పేలుళ్లను చూస్తూ నిలబడినవారేనని నిర్ధారణ అయ్యింది. బాధితుల్లో 8 మందికి పైగా శాశ్వతంగా దృష్టిని కోల్పోవడం విషాదకరం. బెంగళూరు, చిక్కబళ్లాపురంలో ముగ్గురు బాలురు పూర్తిగా దృష్టి దోషానికి గురైన దుర్ఘటనలు జరిగినట్లు తెలిసింది.

ఆ బాలునికి రెండు కళ్లు చిద్రం

బెంగళూరులోని కత్రిగుప్పలో 11 సంవత్సరాల బాలుడు టపాకులు పేల్చుతూ ఉండగా ప్రమాదం సంభవించింది. టపాసులు పేలి రెండు కళ్లకు తగిలాయి, మందుగుండు రవ్వలు ఎంత తీవ్రంగా తగిలాయి అంటే.. బాలుడు ధరించిన కళ్లజోడు పగిలిపోయి రెండు కనుగుడ్లు చిట్టిపోయాయి. ఓ కార్పొరేట్‌ కంటి ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరిపినా కూడా కంటి చూపును కాపాడేందుకు సాధ్యపడలేదని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ముందే జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందని అన్నారు.

అయ్యో పాపం.. చిన్నారి బాలిక

చిక్కబళ్లాపురకు చెందిన 5 సంవత్సరాల బాలిక ఇతరులు టపాసులు పేలుస్తుండగా చూస్తూ ఉంది. ఆ సమయంలో పటాకీ వచ్చి కళ్ల ముందు పేలింది, దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక చూపును కోల్పోయింది. ప్రస్తుతం బెంగళూరు మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యులు శస్త్రచికిత్స జరిపేందుకు ఏర్పాట్లు చేసుకొన్నారు. భవిష్యత్‌లో చూపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు.

మరో అబ్బాయికి ఇబ్బంది

బెంగళూరు సిద్ధాపురలో పీయూసీ విద్యార్థి ఒకరు రోడ్డు పక్కన నడచుకొంటూ వెళుతున్నపుడు పటాసు పేలి కంటికి తీవ్ర గాయమైంది. కొందరు యువకులు రాతిపై టపాసును ఉంచి పేల్చినపుడు టపాసు ఎగిరి అతని కంటిని తాకడంతో గాయం తీవ్రత ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులు టపాసులు పేల్చిన యువకుల మీద మండిపడ్డారు. గాయపడిన అబ్బాయి మింటో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇదేమాదిరిగా కళ్లకు తీవ్రగాయాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతరుల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగి జీవితాన్ని చీకటిగా మార్చాయని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

బెంగళూరులోని ఆసుపత్రుల్లో నమోదైన కేసులు

నారాయణ నేత్రాలయ –75 కేసులు

మింటో ఆసుపత్రి –28

శంకర కంటి ఆసుపత్రి –27

ప్రభా కంటి ఆసుపత్రి –11

మోదీ ఆసుపత్రి –3

అగర్వాల్‌ కంటి ఆసుపత్రి – 3

చిచ్చు రేపిన టపాసులు 1
1/1

చిచ్చు రేపిన టపాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement